విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచాలి: సీఎం
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:55 AM
విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నోబుల్ టీచర్స్ అసోసియేషన్(ఎన్‌టీఏ), బహుజన టీచర్స్ అసోసియేషన్(బీటీఏ) రూపొందించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను మంగళవారం సచివాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఎన్‌టీఏ ప్రతినిధులు కోండూరు శ్రీనివాసరాజు, బొనిగల హైమారావు, బీటీఏ ప్రతినిధులు భూపతి రామారావు, చిట్టేటి రమేష్ పాల్గొన్నారు.