Political Meeting: అమిత్‌షాతో చంద్రబాబు భేటీ
ABN , Publish Date - Oct 01 , 2025 | 04:13 AM
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా...
రాజకీయ పరిణామాలు, అభివృద్ధిపై 45 నిమిషాలపాటు చర్చించిన సీఎం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి అమిత్‌షాతో ఆయన నివాసంలో దాదాపు 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇటీవలి రాజకీయ పరిమాణాలను ఆయన దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు సానా సతీశ్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, తెన్నేటి కృష్ణప్రసాద్, మాజీ ఎంపీలు కనకమేడల, కంభంపాటి రామ్మోహన్‌రావు ఉన్నారు.