Gachibowli Land Issue: రాజధానిలో సొంత ఇంటికి శ్రీకారం
ABN , Publish Date - Apr 10 , 2025 | 05:40 AM
గచ్చిబౌలి భూముల వివాదంపై ఎఐ ఆధారిత తప్పుడు పోస్టులు పెట్టినట్టు బీఆర్ఎస్ నేతలు క్రిశాంక్, దిలీప్ కుమార్‌లపై కేసు నమోదైంది. పోలీసులు విచారణకు పిలవగా, తమపై అక్రమంగా దాడులు చేస్తున్నారంటూ వారు తీవ్రంగా మండిపడ్డారు.

శంకుస్థాపన చేసిన చంద్రబాబు దంపతులు
అమరావతి, గుంటూరు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. బుధవారం ఉదయం 8.51 గంటలకు సతీమణి భువనేశ్వరి, తనయుడు నారా లోకేశ్ దంపతులు, మనవడు దేవాన్ష్‌తో కలిసి చంద్రబాబు భూమి పూజ నిర్వహించి, ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వెలగపూడి సచివాలయం వెనుక ఈ9 రహదారి చెంతనే సుమారు 5 ఎకరాల స్థలంలో సీఎం సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు. వేదపండితుల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని కొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. భూమిపూజ సందర్భంగా చంద్రబాబుకు భూమిని విక్రయించిన వెలగపూడి మాజీ సర్పంచ్ కంచర్ల శాంతకుమారి, ఆమె కుమార్తె గీత కలిసి లోకేశ్ దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో రాజధాని రైతులు పాల్గొని చంద్రబాబు, లోకేశ్ దంపతులకు ఘనస్వాగతం పలికారు. మంగళవారం రాత్రే భూమి పూజ జరిగే ప్రదేశాన్ని రాజధాని మహిళా రైతులు రంగవల్లులతో తీర్చిదిద్దారు. శంఖుచక్రాలు తిరునామాలతో వేసిన ముగ్గు చంద్రబాబు దంపతులను విశేషంగా ఆకట్టుకుంది. శంకుస్థాపన అనంతరం రాజధాని రైతులను చంద్రబాబు, లోకేశ్ ఆప్యాయంగా పలకరించి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, చంద్రబాబు రాజధానిలో ఇల్లు కట్టుకుని తమలో ఒకడు కాబోతుండడం తమకెంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా రాజధాని రైతులు, మహిళలు హర్షం వ్యక్తంచేశారు.