Share News

బాబు అభినవ శ్రీకృష్ణదేవరాయలు: నిమ్మల

ABN , Publish Date - Sep 20 , 2025 | 07:19 AM

శ్రీకృష్ణదేవరాయల కాలంలో చెరువులన్నీ నీటితో నిండి కళకళలాడుతుండేవని చెబుతుంటారని.. ఇప్పుడు రాష్ట్రంలోని సాగునీటి వనరులన్నింటిలో జలాలు పుష్కలంగా...

బాబు అభినవ శ్రీకృష్ణదేవరాయలు: నిమ్మల

ఇంటర్నెట్ డెస్క్: శ్రీకృష్ణదేవరాయల కాలంలో చెరువులన్నీ నీటితో నిండి కళకళలాడుతుండేవని చెబుతుంటారని.. ఇప్పుడు రాష్ట్రంలోని సాగునీటి వనరులన్నింటిలో జలాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇందుకు సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న సమగ్ర నీటి యాజమాన్య విధానాలే కారణమన్నారు. చంద్రబాబును అభినవ శ్రీకృష్ణదేవరాయలుగా కొనియాడారు. సభలో శుక్రవారం మంత్రి మాట్లాడారు. వచ్చే ఏడాదిలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, కృష్ణా జలాలను ఆఖరి మైలు దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నా రు. రిజర్వాయర్ల పేరు చెబితే టీడీపీ గుర్తుకు వస్తుందని.. జగన్‌ పేరు చెబితే విధ్వంసం గుర్తుకొస్తుందని అన్నారు. నీటి ప్రాజెక్టుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు సూచించారు.

Updated Date - Sep 20 , 2025 | 07:19 AM