CM Chandrababu Naidu stated: వడ్డీలోనూ వైసీపీ బాదుడు!
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:17 AM
అప్పులు చేయడమే ధ్యేయంగా గత వైసీపీ ప్రభుత్వం అధిక వడ్డీలకు భారీ ఎత్తున రుణాలు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు....
12% వడ్డీకి అప్పులు తెచ్చారు
రుణాలు, వడ్డీలు రీ-షెడ్యూల్‌తో ఆదా
కలిసి పని చేస్తే సత్ఫలితాలు: సీఎం
అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): అప్పులు చేయడమే ధ్యేయంగా గత వైసీపీ ప్రభుత్వం అధిక వడ్డీలకు భారీ ఎత్తున రుణాలు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఫలితంగా వడ్డీల రూపంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘‘గత పాలకుల నిర్లక్ష్యంతో సగటున 12 శాతం మేర అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు. కొన్ని రుణాలను రీ-షెడ్యూలింగ్ ద్వారా మొదటి ఏడాదిలోనే రూ.512 కోట్ల మేర ఆదా చేయగలిగాం. వచ్చే మార్చి నాటికి రూ.1000 కోట్ల మేర ఆదా అవుతుంది. హెచ్‌వోడీలు జాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రజాధనం వృథా కాకుండా నిలువరించే అవకాశం ఉంది. మొత్తంగా అప్పులపై రూ.7 వేల కోట్లు ఆదా అవుతుందని అంచనా. గత పాలనలో ఏపీ బ్రాండ్ పడిపోవడం వల్ల అదనంగా వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాటన్నింటినీ ‘రీ-షెడ్యూల్’ చేసి ప్రజాధనాన్ని కాపాడుతున్నాం. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం రావడంతో పాటు, వాళ్లకు సంతృప్తి కలిగించేలా ప్రభుత్వ శాఖలు పనిచేయాల్సిందే. అంతా కలిసి పనిచేస్తే 3 నెలల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే అవకాశం ఉంది.’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.