CM Chandrababu Highlights: రాష్ర్టాభివృద్ధిలో ఉద్యోగులు కీలకం కావాలి
ABN , Publish Date - Dec 30 , 2025 | 04:20 AM
రాష్ర్టాభివృద్ధిలో ఉద్యోగ సంఘాల నాయకులు కీలక భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీఎన్‌జీజీవో, ఏపీ జేఏసీ అమరావతి, ఉపాధ్యాయ....
ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ సంఘాల క్యాలెండర్, డైరీ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, విజయవాడ సిటీ, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ర్టాభివృద్ధిలో ఉద్యోగ సంఘాల నాయకులు కీలక భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీఎన్‌జీజీవో, ఏపీ జేఏసీ అమరావతి, ఉపాధ్యాయ, ఆర్టీసీ సంఘాల క్యాలెండర్, డైరీలను సీఎం చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును సోమవారం ఏపీ ఎన్‌జీజీవో అధ్యక్షుడు విద్యాసాగర్, కార్యదర్శి రమణ, ఏపీ జేఏసీ అమరావతి కమిటీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెంకటేశ్వర్లు, రఘునాథరెడ్డి, హృదయరాజు, మంజులు, శ్రీనివాస్, పెన్షనర్స్, సీపీఎస్, గ్రామ/వార్డు సచివాలయ, ఏపీపీఏవో, ఎన్‌జీవో, క్లాస్ 4 ఎంప్లాయిస్, వెటర్నరీ, ఏఈవో, ట్రెజరీ, ఆర్‌ఎ్‌సవో, రెవెన్యూ, ఆర్టీసీ ఈయూ, ఆర్టీసీ ఎన్‌ఎంయూ, కో-ఆపరేటివ్, లేబర్ ఆఫీసర్, పీఆర్ ఇంజనీర్ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయా సంఘాలకు చెందిన క్యాలెండర్, డైరీలను సీఎం ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు సారఽథ్యంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఈ సందరర్భంగా ఆయా సంఘాల నేతలు ఓ ప్రకటనలో ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సంబంధించిన కొన్ని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.
ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ ఫ్రెండ్లీ ప్రభుత్వం
ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం(ఆప్టా), తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం(టీఎన్‌యూఎస్), ఏపీటీఎఫ్ రూపొందించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఆప్టా ప్రతినిధులు కాకి ప్రకాశ్‌రావు, కె.వెంకటరత్నం, టీఎన్‌యూఎస్ ప్రతినిధులు మన్నం శ్రీనివాస్, చెరుకూరి పూర్ణచంద్రరరావు, ఏపీటీఎఫ్ నేతలు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి తదితరులు సీఎంను కలిశారు.