CM Chandrababu: సుపరిపాలనతో ఎన్డీయేను బలోపేతం చేస్తున్నారు
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:48 AM
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని పలువురు ప్రముఖలు ఆయన కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ అభిమానులు, జనసైనికులు, నేతలు కేక్‌లు కట్ చేసి...
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ, అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు
రాష్ట్రాభివృద్ధిలో ఆయన సహకారం మరువలేనిది: సీఎం చంద్రబాబు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని పలువురు ప్రముఖలు ఆయన కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ అభిమానులు, జనసైనికులు, నేతలు కేక్‌లు కట్ చేసి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో స్పందిస్తూ... ‘పవన్ కల్యాణ్‌కు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు. ఎంతో మంది ప్రజల హృదయాల్లో, ఆలోచనల్లో పవన్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఎన్డీయేను బలోపేతం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా మరింత కాలం జీవించాలని ప్రార్థిస్తున్నా’ అని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్‌లో స్పందిస్తూ... ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయాలనే మీ ఉత్సాహపూరిత, నిబద్ధ వైఖరి ప్రశంసనీ యం’ అని పేర్కొన్నారు.
మీ సహకారం మరువలేనిది: బాబు
సీఎం చంద్రబాబు ఎక్స్‌లో స్పందిస్తూ... ‘మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం. అణువణువునా సామాజిక స్పృహ... మాటల్లో పదును... చేతల్లో చేవ... జనసైన్యానికి ధైర్యం... మాటకి కట్టుబడేత త్వం... రాజకీయాల్లో విలువలకు పట్టం... స్పం దించే హృదయం... అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానులు, కార్యకర్తలు, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి. మరెన్నో విజయశిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్ధిలో మీ సహకారం మరువలేనిది.’ అని పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ స్పందిస్తూ... ‘వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారు. ప్రజల కోసం తగ్గుతారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి, అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పవన్ కల్యాణ్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
పొర్లుదండాలతో జపాలి మెట్లెక్కిన పవన్ వీరాభిమాని
తిరుమల, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా బలిజపల్లికి చెందిన ఈశ్వర్, పవన్ కల్యాణ్ పుట్టినరోజున మంగళవారం తిరుమలలోని జపాలి మెట్లను పొర్లుదండాలతో ఎక్కారు. మరో 30 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వమే కొనసాగాలని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆంజనేయస్వామిని కోరుకుంటూ ఈ పొర్లుదండాలు చేసినట్టు పవన్ వీరాభిమాని ఈశ్వర్ తెలిపారు. 71 రోజుల పాటు దీక్షబూని ఈ పొర్లుదండాలు చేసినట్టు వివరించారు. పవన్ కోసం ఈయన గతంలోనూ అలిపిరి, శ్రీవారిమెట్టు దారుల్లో ఇదేవిధంగా పొర్లుదండాలతో తిరుమల చేరుకున్నారు. తిరుత్తణి, విజయవాడ కనకదుర్గమ్మ క్షేత్రాలనూ ఇలాగే దర్శించుకున్నారు.
