Share News

CM Chandrababu Naidu: అభివృద్ధిపై దృష్టి పెట్టండి

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:40 AM

ఉద్యాన పంటలు, మత్స్య, పర్యాటక రంగాల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో మంత్రులు చురుకుగా వ్యవహరించాలని సూచించారు.

CM Chandrababu Naidu: అభివృద్ధిపై దృష్టి పెట్టండి

మీ సొంత పనుంటే నాకు చెబుతారా?

మంత్రి కొల్లు రవీంద్రపై సీఎం సెటైర్లు

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఉద్యాన పంటలు, మత్స్య, పర్యాటక రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. జిల్లా సమస్యలపై మంత్రులు కూడా దృష్టిపెట్టి పరిష్కారాలు చూపించాలన్నారు. చిన్నచిన్న మొత్తాల్లో నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు. కాగా, మచిలీపట్నంలో ఒక సమస్యపై కోర్టులో కేసులున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర సీఎంకు చెప్పారు. దానిపై సీఎం స్పందిస్తూ... ‘సమస్య ఉందంటే ఎలా? మీరే కూర్చొని పరిష్కరించుకోవాలి. మీ సొంత పని ఉందంటే ఏం చేస్తావు... నాకు చెబుతావా? అలాగే ప్రభుత్వ సమస్యలూ వెంటనే పరిష్కరించేలా బాధ్యత తీసుకోవాలి’ అన్నారు. కాగా, కలెక్టర్ల సదస్సును ఈ-కాన్ఫరెన్స్‌ తరహాలో నిర్వహించారు. ఈసారి ప్రింట్లతో పనిలేకుండా మంత్రులతో సహా అందరూ తమవెంట తెచ్చుకున్న ల్యాప్‌టా్‌పల్లోనే ప్రజెంటేషన్లు చూశారు.


ఒక్క పాఠశాలనూ మూసేయం: లోకేశ్‌

జీవో 117కు ప్రత్యామ్నాయంగా మరో మోడల్‌ సిద్ధం చేసి, జిల్లా కలెక్టర్లకు పంపించామని మంత్రి లోకేశ్‌ తెలిపారు. దీనిపై ఏప్రిల్‌ మొదటి వారంలో మోడల్‌పై కలెక్టర్లు రిపోర్టులు పంపిస్తే, ఆ తర్వాత టీచర్ల బదిలీలు చేస్తామని వివరించారు. కలెక్టర్ల సదస్సులో బుధవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా మూసివేయకూడదన్న నిర్ణయంతో ఉన్నామని లోకేశ్‌ స్పష్టం చేశారు.

ఈకేవైసీ త్వరగా పూర్తిచేయాలి:నాదెండ్ల

కలెక్టర్లంతా ఈకేవైసీని త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌ కోరారు. ఇప్పటికీ కొన్ని జిల్లాలు 80 శాతమే పూర్తిచేశాయని, ఏప్రిల్‌ నాటికి అన్ని జిల్లాలూ 100శాతం ఈకేవీసీ చేయాలని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

చిత్రం భళారే విచిత్రం

Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..

Updated Date - Mar 27 , 2025 | 04:40 AM