Share News

CM Chandrababu: సీమలో కృష్ణమ్మ పరవళ్లు

ABN , Publish Date - Aug 11 , 2025 | 03:41 AM

రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే హంద్రీ-నీవా ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు చూసి...

CM Chandrababu: సీమలో కృష్ణమ్మ పరవళ్లు

  • నా మనసు పులకరిస్తోంది!: సీఎం చంద్రబాబు

అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే హంద్రీ-నీవా ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు చూసి తన మనసు పులకరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా నీటి ప్రవాహల వీడియోను పోస్టు చేశారు. ‘ప్రతి ప్రాజెక్టు నిండేలా.. ప్రతి చెరువుకూ నీరందేలా.. చివరి భూములను సైతం తడిపేలా.. అత్యధిక సామర్థ్యంతో హంద్రీ-నీవా కాల్వల్లోని నీటి ప్రవాహాలు రైతన్నల ఆశలను, ఆకాంక్షలను తీరుస్తున్నాయి. రికార్దు సమయంలో కాల్వల విస్తరణ చేపట్టిన కారణంగానే ఈ సీజన్లో చివరి భూములకు నీరందించాలనే మా కల సాకారమవుతోంది. రైతుల సంతోషం మా సంకల్పానికి మరింత బలాన్నిస్తోంది’ అని ట్వీట్‌ చేశారు.

Updated Date - Aug 11 , 2025 | 03:42 AM