CM Chandrababu: జీఎస్టీ సంస్కరణలతో సామాన్యులకు ప్రయోజనం
ABN , Publish Date - Sep 22 , 2025 | 03:51 AM
జీఎస్టీ సంస్కరణల ప్రారంభం, జీఎస్టీ బచత్ ఉత్సవ్ ప్రారం భంం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు.
ప్రధాని మోదీకి అభినందనలు: సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ సంస్కరణల ప్రారంభం, జీఎస్టీ బచత్ ఉత్సవ్ ప్రారం భంం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. సామాన్య పౌరుడికి పాలనలో పెద్దపీట వేసే అసలైన వేడుక ఇదని సీఎం కొనియాడారు. పన్ను స్లాబుల సంఖ్యను కేవలం రెండుకు తగ్గించడం ద్వారా పౌరులకు ముఖ్యంగా పేద, మద్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు రోజువారీ జీవితాన్ని మరింత సరళతరం చేస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. వ్యాపారాలు వృద్ధి చెందడానికి సహాయపడుతుందని, మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ కూడా ప్రధానికి అభినందనలు తెలిపారు. ’ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో జీఎస్టీ 2.0 తక్కువ రేట్లకు నిత్యావసరాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. ఇప్పుడు ప్రతి ఇంటికీ నిజమైన జీఎస్టీ బచత్ ఉత్సవ్ వచ్చింది, ఈ సంస్కరణలు పెట్టుబడిని వేగవంతం చేస్తాయి. స్థానిక తయారీదారులకు శక్తినిస్తాయి. భారతదేశ వృద్ధి ప్రయాణానికి ఇంధనంగా ఉంటాయి’ అని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
మోహన్‌లాల్‌కు సీఎం అభినందనలు
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన సీనియర్ నటుడు మోహన్‌లాల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. మోహన్‌లాల్ ప్రతిభకు దక్కిన పురస్కారంగా దీన్ని చంద్రబాబు అభివర్ణించారు.