Chandrababu Naidu: వైసీపీ బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
ABN , Publish Date - Apr 14 , 2025 | 02:51 AM
వైసీపీ హింసలకు గురైన పల్నాడు జిల్లా ఎస్సీ కుటుంబాలను ఆదుకుంటానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పునరావాసం, ఆర్థిక సహాయం, ఇళ్ల మరమ్మతులు వంటి అంశాల్లో పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఆర్థికంగా బలోపేతానికి మార్గం చూపిస్తాం
ఆత్మకూరు ఎస్సీ కుటుంబాలకు సీఎం హామీ
జూలకంటి సారథ్యంలో బాబుతో బాధితుల భేటీ
అమరావతి, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): వైసీపీ బాధిత కుటుంబాలన్నిటినీ పార్టీ తరఫున ఆదుకుంటామని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో వైసీపీ నేతల దాష్టీకాలకు గురైన పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన పలు ఎస్సీ కుటుంబాలు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉండవల్లి నివాసంలో సీఎంను కలిశాయి. ఆ ఐదేళ్లలో తమ కష్టాలను వారు వివరించారు. 127 ఎస్సీ కుటుంబాలు వైసీపీ నేతల దాడులు, దౌర్జన్యాలకు గురయ్యాయని తెలిపారు. ప్రాణాలు కాపాడుకోవడానికి పుట్టిన ఊరు వదిలి ఐదేళ్లపాటు వేరే గ్రామాల్లో తలదాచుకున్నామని చెప్పారు. తాము ఊళ్లో లేకపోవడంతో తమ ఇళ్లను కూడా ధ్వంసం చేశారని తెలిపారు. సీఎం స్పందిస్తూ.. పార్టీ కోసం పోరాడిన ప్రతి కార్యకర్త కుటుంబానికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న ఇళ్లను మరమ్మతులు చేయిస్తామని..ప్రతి కుటుంబాన్నీ ఆర్థికంగా బలోపేతం చేసే మార్గం చూపిస్తామని హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ
AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
For AndhraPradesh News And Telugu News