CM Chandrababu: గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:18 AM
వాహనదారులకు శుభవార్త. పాత వాహనాలకు గ్రీన్‌ట్యాక్స్‌ను తగ్గించాలంటూ సవరించిన వాహన పన్ను విధింపు బిల్లును శుక్రవారం అసెంబ్లీ ఆమోదించింది.
12 ఏళ్లు పైబడిన లారీలకు వర్తింపు.. 15 వేల నుంచి 3 వేలకు.. 5 వేల నుంచి 1500కు
వాహన పన్ను సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.. ఎన్నికల హామీ నెరవేర్చిన చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వాహనదారులకు శుభవార్త. పాత వాహనాలకు గ్రీన్‌ట్యాక్స్‌ను తగ్గించాలంటూ సవరించిన వాహన పన్ను విధింపు బిల్లును శుక్రవారం అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిప్రకారం 12 ఏళ్లు పైబడిన లారీలకు గ్రీన్‌ట్యాక్స్ తగ్గుతుంది. 10 టన్నుల లారీపై పన్ను రూ.5,000 ఉండగా, దాన్ని రూ.1500కి తగ్గించారు. అలాగే 30 టన్నుల లారీలపై పన్నును రూ.15,000 నుంచి రూ.3,000కి తగ్గించారు. వాహనాలపై వైసీపీ ప్రభుత్వం పెంచిన గ్రీన్‌ట్యాక్స్‌ను తగ్గిస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నేరవేర్చారు. గత ప్రభుత్వం పర్యావరణం పేరుతో పాత వాహనాలపై ఎక్కువ పన్ను వేసిందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అసెంబ్లీలో విమర్శించారు. 2018-19లో గ్రీన్‌ట్యాక్స్ రూ.5 కోట్లు వసూలు కాగా, వైసీపీ హయాంలో రూ.100 కోట్లు వసూలు చేశారని విమర్శించారు. పారిశ్రామిక వివాదాల సవరణ బిల్లు 2019 ఉపసంహరణ బిల్లును, లేబర్ కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్ బిల్లు 2019 ఉపసంహరణ బిల్లును ఆమోదం కోసం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.