Chandrababu Naidu: గంగమ్మ సేవలో సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 22 , 2025 | 06:21 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు భువనేశ్వరి కుప్పం లోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మను దర్శించి, ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ సారె సమర్పించారు. వారం రోజులుగా జరుగుతున్న గంగజాతర ఉత్సవాల ముగింపు రోజున అమ్మవారి విశ్వరూప దర్శనం కార్యక్రమంలో పాల్గొన్నారు.
కుప్పంలో సతీసమేతంగా పట్టువస్త్రాల సమర్పణ
కుప్పం, మే 21(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు బుధవారం చిత్తూరు జిల్లా కుప్పంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబను దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సారె సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. మూడున్నర దశాబ్దాలుగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వారం రోజులుగా గంగజాతర వైభవంగా జరుగుతోంది. ఉత్సవాల చివరి రోజైన బుధవారం అమ్మవారి విశ్వరూప దర్శనం జరిగింది. ఈ నేపథ్యంలో సతీసమేతంగా కుప్పం విచ్చేసిన చంద్రబాబు.. సంప్రదాయ దుస్తులు ఽధరించి, టీటీడీ నుంచి తెచ్చిన పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ సారె తీసుకుని ఊరేగింపుగా అమ్మవారి చెంతకు వచ్చారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి సారె సమర్పించారు. గంగమ్మను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి