CM Chandrababu: పర్యావరణ హితంగా వినాయక చవితి
ABN , Publish Date - Aug 27 , 2025 | 06:13 AM
వినాయక చవితి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. గణేశ్ చతుర్ధి సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి....
ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు
అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): వినాయక చవితి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. గణేశ్ చతుర్ధి సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రచార కార్యక్రమా న్ని చేపట్టింది. ప్రత్యేక సందేశాలతో రూపొందించిన పోస్టర్‌ను మంగళవా రం సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఇంటి పెరటిలోనే నిమజ్జనం చేసుకునేలా మట్టి గణపతి, విత్తన గణపతి ప్రతిమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారి్‌సతో తయారు చేసిన విగ్రహాల్లో జిప్స మ్, గంధకం, మెగ్నీషియం వంటివి ఉంటాయని, అవి నీటిలో కలిసి, పెద్ద ఎత్తున నీటి కాలుష్యంతో ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. పీసీబీ చైర్మన్ పి.కృష్ణయ్య, పీసీబీ సభ్య కార్యదర్శి శరవణ్ తదితరులు పాల్గొన్నారు.