CM and Deputy CM Extend Warm Vijayadashami: కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలి
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:52 AM
సకల చరాచర జీవరాశులను సంరక్షించే శక్తి స్వరూపిణి అయిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని...
రాష్ట్ర ప్రజలకు సీఎం, డిప్యూటీ సీఎం విజయదశమి శుభాకాంక్షలు
అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ‘సకల చరాచర జీవరాశులను సంరక్షించే శక్తి స్వరూపిణి అయిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ‘రాక్షస సంహారంతో లోకానికి శాంతి సౌభాగ్యాలు తెచ్చిన ఆ తల్లి చల్లని చూపు రాష్ట్రంపై ఇదే విధంగా కొనసాగాలి. సంక్షేమం, అభివృద్ధితో ఈ మహాయజ్ఞాన్ని కొనసాగించే నైతిక బలాన్ని అందివ్వాలి. ఈ దసరా పండుగ ఇంటింటా వెలుగులు నింపాలి’ అని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కాగా, తెలుగు ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు.