Chief Minister Chandrababu Naidu: సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం
ABN , Publish Date - Dec 18 , 2025 | 03:49 AM
కంభంపాటి రామ్మోహన్‌రావు తల్లి వెంకట నరసమ్మ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు. బుధవారం రాత్రి రామ్మోహన్‌రావును ఫోన్‌లో...
అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): కంభంపాటి రామ్మోహన్‌రావు తల్లి వెంకట నరసమ్మ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు. బుధవారం రాత్రి రామ్మోహన్‌రావును ఫోన్‌లో పరామర్శించారు. కంభంపాటి రామ్మోహన్‌రావు తల్లి వెంకట నరసమ్మ మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రామ్మోహన్‌రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, చిత్తూరు టీడీపీ సీనియర్ నేత రామచంద్రరాజు కుటుంబసభ్యులకూ చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. ఎన్టీఆర్ రాజుగా పిలుచుకునే రామచంద్రరాజు బుధవారం కన్నుమూశారు.