Share News

నేడు క్లీన్‌ ఎయిర్‌ థీమ్‌తో స్వచ్ఛ ఆంధ్ర: నారాయణ

ABN , Publish Date - Oct 18 , 2025 | 05:34 AM

రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహించాలని మున్సిపల్‌ అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు.

నేడు క్లీన్‌ ఎయిర్‌ థీమ్‌తో స్వచ్ఛ ఆంధ్ర: నారాయణ

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహించాలని మున్సిపల్‌ అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. శుక్రవారం ఆయన మున్సిపల్‌ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ నెల క్లీన్‌ ఎయిర్‌ థీమ్‌తో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ప్రజాప్రతినిధులను, ప్రజలను భాగస్వామ్యం చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గాలి కాలుష్యం తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి నెలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటిన్నర మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. విజన్‌ 2047లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఎంతో కీలకమైందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 05:35 AM