Share News

వీఆర్వో, టీడీపీ నాయకుడి మధ్య ఘర్షణ

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:00 AM

మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం ఒకటవ వీఆర్వో వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకుడు ఆదిత్యరెడ్డి మధ్య ఘర్షణ జరిగింది.

   వీఆర్వో, టీడీపీ నాయకుడి మధ్య ఘర్షణ
గాయపడ్డ వీఆర్వో వెంకటేశ్వర్లు

గాయపడ్డ వీఆర్వో వెంకటేశ్వర్లు

సి.బెళగల్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం ఒకటవ వీఆర్వో వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకుడు ఆదిత్యరెడ్డి మధ్య ఘర్షణ జరిగింది. మిగులు భూమిని ఆనలైనలో నమోదు చేసే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఇది గమనించిన పక్కన ఉన్న రైతులు ఇద్దరినీ విడిపించారు. గాయపడ్డ వీఆర్వోను మండలంలోని వీఆర్వోలందరూ కలిసి చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. ఇనచార్జి తహసీల్దార్‌ పురుషోత్తంను వివరణ కోరగా వీఆర్వోపై ఘర్షణ జరిగిన విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమస్యను పరిస్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

Updated Date - Mar 29 , 2025 | 12:00 AM