Share News

CID Notice: విజయసాయి రెడ్డికి మళ్లీ సీఐడీ పిలుపు!

ABN , Publish Date - Mar 19 , 2025 | 03:39 AM

సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు ఇవ్వనుంది.

CID Notice: విజయసాయి రెడ్డికి మళ్లీ సీఐడీ పిలుపు!

కాకినాడ పోర్టు వ్యవహారంలో విచారణకు రావాలని త్వరలో నోటీసులు

అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు ఇవ్వనుంది. కాకినాడ సెజ్‌, పోర్టు యజమాని కేవీ రావును బెదిరించి వాటాలను బదిలీ చేయించుకున్న వ్యవహారంలో విచారణ కోసం మళ్లీ రావాలని త్వరలో శ్రీముఖం పంపనుంది. తనను బెదిరించి కాకినాడ పోర్టులో, సెజ్‌లో వాటాలు రాయించుకున్నారంటూ కేవీ రావు.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఐడీకి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు సంస్థ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా ఈ నెల 12న విజయవాడలో సీఐడీ అధికారులు పిలిచి విచారించగా మొత్తం విక్రాంత్‌ రెడ్డే చేశారని విజయసాయిరెడ్డి కుండబద్దలు కొట్టారు. ఇంకోవైపు.. తనపై సీఐడీ జారీ చేసిన లుకవుట్‌ సర్క్యులర్‌ను రద్దు చేయాలని ఆయన ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు నోటీసులు జారీ చేయగా.. సీఐడీ కౌంటర్‌ దాఖలు చేసింది. కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, విజయసాయిరెడ్డిని మరోమారు ప్రశ్నించాల్సి ఉందని అందులో పేర్కొంది.

Updated Date - Mar 19 , 2025 | 03:40 AM