Share News

దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:56 PM

సొసైటీ ఉ ద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని నందికొట్కూరు, పగిడ్యాల సీఈవోలు రబ్బాని, ఖాజాబాషా డిమాండ్‌ చేశారు.

దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి
నందికొట్కూరులో ధర్నా చేస్తున్న ఉద్యోగులు

నందికొట్కూరు, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): సొసైటీ ఉ ద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని నందికొట్కూరు, పగిడ్యాల సీఈవోలు రబ్బాని, ఖాజాబాషా డిమాండ్‌ చేశారు. సోమ వారం సహకార సంఘం సొసైటీ డీసీసీ బ్యాంక్‌ నందికొట్కూరు బ్రాంచ ముందు సొసైటీ ఉద్యోగులు దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహించారు. సీపీఐ(ఎంఎల్‌)లిబరేషన నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రబ్బాని, ఖాజాబాషా, నాయ కుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జీవో నెంబరు 36ను వెంటనే అమలు చేయాలని, 2019, 2024 పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ చేయాలని డిమాండ్‌ చేశారు. మధ్యంతర భృతి ఇవ్వాలని, గ్రాట్యూ టీ చట్టాన్ని అమలు చేయాలని, ఉద్యోగులకు జీతభత్యాలను డీఎల్‌ ఎఫ్‌ ద్వారా నిరవధికంగా చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో మిడు తూరు మండల సీఈవో మల్లికార్జు, బ్రాహ్మణకొట్కూరు సీఈవో అశోక్‌కుమార్‌, బ్యాంక్‌ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

ఆత్మకూరు: వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల డిమాం డ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఆత్మకూరు సొసైటీ మేనేజర్‌ నాగేశ్వరరావు కోరారు. సోమవారం స్థానిక డీసీసీ బ్యాంకు ఎదుట ఆత్మకూరు, నాగంపల్లి, వేంపెంట సొసైటీల ఉద్యోగుల నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులను, సిబ్బందిని రెగ్యూలరైజ్‌ చేయాలన్నారు. అనంతరం డీసీసీ బ్యాంకు మేనేజర్‌ మహ్మద్‌ రసూల్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

Updated Date - Dec 08 , 2025 | 11:56 PM