Christmas Celebrations: 22న విజయవాడలో క్రిస్మస్ హైటీ
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:05 AM
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందస్తు వేడుకల్లో భాగంగా విజయవాడలోని ఏ-ప్లస్ కన్వెన్షన్‌లో ఈ నెల 22న...
ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందస్తు వేడుకల్లో భాగంగా విజయవాడలోని ఏ-ప్లస్ కన్వెన్షన్‌లో ఈ నెల 22న క్రిస్మస్ హైటీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతారని, పొరపాట్లు లేకుండా ఎన్టీఆర్ కలెక్టర్ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.