Chivireddy PA Balaji Petition: ఇతర ఖైదీలున్న బ్యారక్‌లోకి మార్చండి
ABN , Publish Date - Jul 12 , 2025 | 06:42 AM
గుంటూరు జిల్లా జైలులో తనను ఒంటరిగా సెల్‌లో ఉంచారని, ఇతర ఖైదీలున్న బ్యారక్‌లోకి మార్చాలని గుంటూరు జిల్లా జైల్లో ఉన్న బాలాజీ...
కోర్టులో చెవిరెడ్డి పీఏ బాలాజీ పిటిషన్
విజయవాడ, జూలై 11(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా జైలులో తనను ఒంటరిగా సెల్‌లో ఉంచారని, ఇతర ఖైదీలున్న బ్యారక్‌లోకి మార్చాలని గుంటూరు జిల్లా జైల్లో ఉన్న బాలాజీ యాదవ్ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పీఏ బాలాజీ యాదవ్‌తోపాటు నవీన్‌కృష్ణను మద్యం కేసులో సిట్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. బాలాజీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని జైలు అధికారులను ఆదేశిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేశారు.