Dairy Plant: చిత్తూరులో ఇంటిగ్రేటెడ్ డైరీ ప్లాంట్
ABN , Publish Date - Jul 29 , 2025 | 06:12 AM
చిత్తూరు జిల్లాలో ఇంటిగ్రేటెడ్ డైరీ ప్లాంట్, పశువుల దాణా ప్లాంట్ స్థాపన కోసం శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని ప్రకటించింది.
282.20 కోట్ల పెట్టుబడి... 400 మందికి ఉపాధి
ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీ వర్తింపు
అమరావతి, జూలై 28(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో ఇంటిగ్రేటెడ్ డైరీ ప్లాంట్, పశువుల దాణా ప్లాంట్ స్థాపన కోసం శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని ప్రకటించింది. రూ.282.20 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్లలో 2027, జూలై 31వ తేదీ నాటికి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించి 400 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ ప్రతిపాదిత పెట్టుబడి మెగా ప్రాజెక్టు వర్గంలోకి వస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ (4.0) కింద కొన్ని ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని వర్తింపజేస్తూ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి చిరంజీవులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాజెక్టు స్థిర మూలధన పెట్టుబడిలో రూ.89.94 కోట్లు (32.94ు) వరకు రాయితీని ఐదేళ్లలో కంపెనీకి చెల్లించనున్నారు. పాల ప్రాసెసింగ్ యూనిట్‌కు మూలధన పెట్టుబడిలో సబ్సిడీ కింద రూ.41.10 కోట్ల (30ు) వరకు, పశుగ్రాసం యూనిట్ కోసం స్థిర మూలధన పెట్టుబడిలో రూ. 17.85 కోట్ల (35ు) వరకు, ఉపాధి రాయితీ కింద రూ. 12.96 కోట్ల (8ు) వరకు రాయితీలను ప్రకటించారు. విద్యుత్తు సబ్సిడీ యూనిట్‌కు ఒక రూపాయి చొప్పున ఐదేళ్లలో రూ.1.99 కోట్లు, వడ్డీ రాయితీ కింద గరిష్ఠంగా రూ.కోటి వరకు, ఐదేళ్లపాటు ఎస్‌జీఎ్‌సటీ రీయింబర్స్‌మెంట్ రూ.8.73 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించనుంది. భూమి రిజిస్ట్రేషన్, ప్రాజెక్టు సంబంధిత ఒప్పందాలపై స్టాంప్ డ్యూటీ పూర్తి రీయింబర్స్‌మెంట్ ప్రకటించింది.