ఆశలు రేపుతున్న మిరప ధరలు
ABN , Publish Date - Sep 05 , 2025 | 11:55 PM
రప ధరలు పతనమైన వేళ నష్టాలలో కూరుకుపోతున్న అన్నదాతకు ప్రస్తుతం ధరలు రైతులకు ఆశలు రేకెత్తిస్తున్నాయి.
హాలహర్వి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మిరప ధరలు పతనమైన వేళ నష్టాలలో కూరుకుపోతున్న అన్నదాతకు ప్రస్తుతం ధరలు రైతులకు ఆశలు రేకెత్తిస్తున్నాయి. గత ఏడాది పూర్తి స్థాయిలో ధర పతనం కావడంతో ఈ సంవత్సరం రైతులు మిరప సాగుపై చాలామంది రైతులు విముఖత చూపారు. ఆలూరు నియోజకవర్గంలో ఎల్లెల్సీ, హెచ్చెల్సీ, హంద్రీనీవా కాలువల కింద సాగు చేసుకున్న రైతులకు ప్రస్తుతం పెరిగిన ధరలు ఊరట ఇస్తున్నాయి. ధర లేక అమ్ముకోలేని రైతులు మార్కెట్‌లో అలాగే స్టాక్ ఉంచి వచ్చేశారు. ప్రస్తుతం తేజ రకం రూ.16 వేలు, సిజంటా రూ.20 వేలు, బ్యాడిగరకం రూ.25 వేలు ధరలు పెరగడంతో శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకున్న మిరపను రైతులు విక్రయిస్తున్నారు.