Share News

మిరప పంట దగ్ధం

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:04 AM

మండలంలోని డబ్ల్యూ. గోవిం దిన్నె గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, నరసింహాలకు చెందిన 50 క్విం టాళ్ల మిరప పంట ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. దీంతో దాదాపు రూ.6 లక్షలు నష్టం వాటిల్లింది.

మిరప పంట దగ్ధం
కాలిన మిరప పంటను పరిశీలిస్తున్న టీడీపీ నాయకుడు భూమా సందీప్‌రెడ్డి

దొర్నిపాడు, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని డబ్ల్యూ. గోవిం దిన్నె గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, నరసింహాలకు చెందిన 50 క్విం టాళ్ల మిరప పంట ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. దీంతో దాదాపు రూ.6 లక్షలు నష్టం వాటిల్లింది. అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, నరసింహాలు ఇరువురు కలిసి మూడున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని మిరప పంట సాగు చేశారు. పొలంలో మిరప కాయలను కుప్పగా పోసి పెట్టారు. రాత్రిళ్లు పశువులు, జంతువులు రాకుండా కాపాలా ఉంటూ చలిమంట వేసుకున్నారు. గురువారం తెల్లవారుజామున మంటను ఆర్ప కుండా ఇంటికి వెళ్లారు. గాలి వీచడంతో పక్కనే ఉన్న పట్టలపై నిప్పులు పడి మంటలు వ్యాప్తి చెందాయి. పక్కనే ఉన్న మిరప కుప్పపై నిప్పులు పడటంతో దాదాపు 50 క్వింటాళ్ల మిరప కాయలు దగ్ధమయ్యాయి. చుట్టు పక్కల వారు గమనించి ఆళ్లగడ్డ అగ్నిమాపకదళ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పి వేశారు. చేతికొచ్చిన మిరప పంట కాలి పోవడంతో బాధిత కౌలు రైతులు కన్నీరుమున్నీరయ్యారు. కాలిపోయిన పంటను టీడీపీ నాయకులు భూమా సందిప్‌రెడ్డి, కేసీకెనాల్‌ డిసి్ట్రబ్యూటరీ చైర్మన ఏరువ ప్రసాద్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి కాలిన పంటను పరిశీలించారు. ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందేలా చూస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు.

Updated Date - Apr 11 , 2025 | 12:04 AM