పాత పాఠశాలలోనే పిల్లలను కొనసాగించాలి
ABN , Publish Date - Jun 13 , 2025 | 12:11 AM
తమ పిల్లలను ప్రస్తుతం ఉన్న పాఠశాలలోనే కొనసాగించాలని మోడల్ స్కూల్ పేరుతో ఇతర పాఠశాలలో విలీ నం చేయడం తగదని కల్లూరు, లింగారెడ్డినగర్ విద్యార్థులు, తల్లి దండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కల్లూరు దళితవాడ, లింగారెడ్డినగర్ విద్యార్థుల, తల్లిదండ్రుల నిరసన
ప్రొద్దుటూరు టౌన్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): తమ పిల్లలను ప్రస్తుతం ఉన్న పాఠశాలలోనే కొనసాగించాలని మోడల్ స్కూల్ పేరుతో ఇతర పాఠశాలలో విలీ నం చేయడం తగదని కల్లూరు, లింగారెడ్డినగర్ విద్యార్థులు, తల్లి దండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్లూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, లింగారెడ్డినగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ మేరకు గురువారం నిరసన వ్యక్తం చేశారు. కల్లూరు దళితవాడ పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఉండగా 3, 4, 5 తరగతులను మోడల్ స్కూలులో విలీనం చేశారు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాలలు ప్రారంభించిన మొదటిరోజే నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలను ప్రస్తుతం ఉన్న పాత పాఠశాలలోనే కొనసాగించాలని, మోడల్ స్కూల్‌లో విలీనం చేస్తే పిల్లలను బడికి పంపించేది లేదని స్పష్టం చేశారు. లింగారెడ్డినగర్ ప్రాథమిక పాఠశాలకు చెందిన 3, 4, 5 తరగతుల విద్యార్థులను విరాట్‌నగర్ మోడల్ పాఠశాలలో విలీనం చేశారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమ పిల్లలను ప్రస్తుతం ఉన్న పాఠశాలలోనే కొనసాగించాలని విద్యాశాఖాధికారులను కోరారు.