Share News

AP Chief Secretary: స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుపై సీఎస్‌ సమీక్ష

ABN , Publish Date - Nov 02 , 2025 | 06:01 AM

ఫీడర్‌, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ మీటరింగ్‌ను నిర్దేశిత కాలపరిమితిలో వంద శాతం పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ విద్యుత్తు పంపిణీ సంస్థలను ఆదేశించారు.

AP Chief Secretary: స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుపై సీఎస్‌ సమీక్ష

అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఫీడర్‌, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ మీటరింగ్‌ను నిర్దేశిత కాలపరిమితిలో వంద శాతం పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ విద్యుత్తు పంపిణీ సంస్థలను ఆదేశించారు. శనివారం డిస్కంల సీఎండీలతో ఆర్డీఎ్‌సఎస్‌ (రీవేంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీం) కింద స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటులో పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. విద్యుత్తు పంపిణీ సంస్థలు ఇప్పటి వరకు 17.96 లక్షల స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేశాయని, ఇవి మంజూరైన మీటర్లలో సుమారు 45 శాతం కాగా, వీటిలో సుమారు 96 శాతం వినియోగంలోకి వచ్చాయని సీఎస్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ, వాణిజ్య సముదాయాలు, అధిక విద్యుత్తు వాడే గృహ వినియోగదారుల వద్ద స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈపీడీసీఎల్‌ పరిధిలో ప్రీపెయిడ్‌ మీటర్ల పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టిన ఇన్‌స్టాలేషన్లు విజయవంతంగా ప్రారంభమయ్యాయని, అన్ని ప్రభుత్వ విభాగాల్లో ప్రీపెయిడ్‌ ఆపరేషన్లను విస్తరింపచేయాలని కోరారు. ఆర్డీఎ్‌సఎస్‌ కింద ఫీడర్‌ మానిటరింగ్‌, స్మార్ట్‌ మీటరింగ్‌లో డిస్కంలు సాధించిన పురోగతిని సీఎస్‌ ప్రశంసించారు. రాష్ట్రంలోని 11 కేవీ ఫీడర్లలో 92.65 శాతం ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ సాధించామని తెలిపారు.

Updated Date - Nov 02 , 2025 | 06:02 AM