పీ-4 అమలుకు చర్యలు తీసుకోవాలి: సీఎస్
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:56 AM
పీ-4 కార్యక్రమంపై ఈ నెల 6 లోగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యచరణ ప్రణాళిక సమావేశాలు పూర్తిచేయాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. సీఎం చంద్రబాబు శుక్రవారం పీ-4పై సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు.
అమరావతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): పీ-4 కార్యక్రమంపై ఈ నెల 6 లోగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యచరణ ప్రణాళిక సమావేశాలు పూర్తిచేయాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. సీఎం చంద్రబాబు శుక్రవారం పీ-4పై సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. సచివాలయం నుంచి ఆయన గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ ‘పీ-4, స్వర్ణాంధ్రప్రదేశ్-2047పై శిక్షణ, అవగాహన కార్యక్రమాలు పూర్తి చేశాం. ఇకపై కార్యాచరణ ప్రణాళికల అమలుకు చర్యలు తీసుకోవాలి. అన్న క్యాంటీన్ల నిర్వహణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఆహారం నాణ్యతగా ఉండేలా చూడాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షించాలి. మున్సిపల్ కార్పొరేషన్లలో రోజూ చెత్త సేకరణ, డ్రెయిన్లలో పూడికతీతపై అధికారులు శ్రద్ధ పెట్టాలి. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలి’ అని సూచించారు.