Office Inauguration: సీఆర్డీఏ కార్యాలయంలో కార్యకలాపాలు
ABN , Publish Date - Oct 24 , 2025 | 05:11 AM
రాజధాని అమరావతిలో నిర్మించిన సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో గురువారం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
తుళ్లూరు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో నిర్మించిన సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో గురువారం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. వేద మంత్రాల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు, అదనపు కమిషనర్ భార్గవతేజ తమ చాంబర్లలోకి అడుగుపెట్టారు. ఐదో ఫ్లోర్‌లో కన్నబాబు, మూడో ఫ్లోర్‌లో భార్గవతేజ తమ తమ చాంబర్లలో ఆశీనులయ్యారు. అలాగే ఇంజనీర్ ఇన్ చీఫ్ అర్.గోపాలకృష్ణారెడ్డి ఐదో ఫ్లోర్‌లోని తన చాంబర్‌లో అడుగుపెట్టారు. వీరికి వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్, అదనపు కమిషనర్‌కు సీఆర్డీఏ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.