Guntur: నేడు శంకర్ నేత్రాలయకు సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 09 , 2025 | 06:22 AM
గుంటూరు జిల్లా పెదకాకానికి సమీపంలోని శంకర్ నేత్రాలయకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం సాయంత్రం రానున్నారు.
గుంటూరు, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా పెదకాకానికి సమీపంలోని శంకర్ నేత్రాలయకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం సాయంత్రం రానున్నారు. ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన దుర్గం నాగ మనోహర్ బ్లాక్‌ను ఆయన ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ ఖరారు కావడంతో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం రాత్రి హెలిప్యాడ్ ప్రాంతాన్ని, సభా వేదిక ప్రాంగణాన్ని, హాస్పటల్లోని అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.