Book Launch Event: ‘ఏ టేల్ ఆఫ్ టు స్టేట్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:52 AM
ప్రముఖ జర్నలిస్టు ఐ.వెంకట్రావు రాసిన ‘ఏ టేల్ ఆఫ్ టు స్టేట్స్’ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.
రచయిత సీనియర్ జర్నలిస్టు ఐ.వెంకట్రావు
అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ జర్నలిస్టు ఐ.వెంకట్రావు రాసిన ‘ఏ టేల్ ఆఫ్ టు స్టేట్స్’ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ‘విలీనం-విభజన’ పేరుతో అదే పుస్తకానికి తెలుగు అనువాదాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. దీనిని తెలుగులోకి అనువదించిన ఎన్.అనూరాధను సీఎం అభినందించారు. ఈ పుస్తకం భావితరాలకు, పరిశోధకులకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విలీనం, విభజనతో పాటు రెండు రాష్ట్రాలను పాలించిన 22 మంది సీఎంల పాలనా కాలాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. రచయిత, రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి కె.చంద్రహాస్, పబ్లిషర్లు ఐ.వేణు, ఐ.రఘు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.