Share News

Chief Justices Honored with Grand Felicitation: న్యాయమూర్తులకు ఘన సన్మానం

ABN , Publish Date - Aug 21 , 2025 | 06:03 AM

రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌, జస్టిస్‌ జగడం సుమతి, జస్టిస్‌ న్యాపతి విజయ్‌లను..

Chief Justices Honored with Grand Felicitation: న్యాయమూర్తులకు ఘన సన్మానం

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌, జస్టిస్‌ జగడం సుమతి, జస్టిస్‌ న్యాపతి విజయ్‌లను హైకోర్టు న్యాయవాదుల సంఘం బుధవారం ఘనంగా సన్మానించింది. హైకోర్టు అసోసియేషన్‌ హాలులో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం ఆధ్వర్యంలో న్యాయమూర్తులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ, ఏఏజీ సాంబశివ ప్రతాప్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ, న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు రఘువీర్‌, ప్రధాన కార్యదర్శి సుబోధ్‌ ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

DBFf.jpgFDZB.jpg

Updated Date - Aug 21 , 2025 | 06:03 AM