Chief Election Commissioner G. Janesh Kumar: మల్లన్న సేవలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్
ABN , Publish Date - Dec 20 , 2025 | 05:33 AM
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు.
శ్రీశైలం, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం తన పూర్వ జన్మ సుకృతమని, ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. దేవస్థానంలో కొలువై ఉన్న శక్తిపీఠంతో పాటు శివయ్య ఆశీస్సులు పొందడం ఆనందాన్ని కలిగిస్తో ందన్నారు. అనంతరం ‘జై భారత్.. జై హింద్..’ అంటూ సీఈసీ నినదిం చారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్, నంద్యాల కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఈఓ శ్రీనివాసరావు తదితరులు సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం తెల్లవారుజామున జరిగే ప్రత్యేక పూజల్లో జ్ఞానేశ్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొంటారని ఆలయ అధికారులు వెల్లడించారు.