Share News

Maoists Move Towards Andhra Pradesh: ఛత్తీస్‌గఢ్‌లో ప్రతికూలతలతో ఏపీకి!

ABN , Publish Date - Nov 19 , 2025 | 05:49 AM

ఆపరేషన్‌ కగార్‌తో ఛత్తీస్‌గఢ్‌లో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల కారణంగా అక్కడి మావోయిస్టులు ఏపీ వైపు చూస్తున్నారని రాష్ట్ర పోలీసు నిఘా విభాగం అధిపతి....

Maoists Move Towards Andhra Pradesh: ఛత్తీస్‌గఢ్‌లో ప్రతికూలతలతో ఏపీకి!

  • కొందరు అడవుల్లోకి.. మరికొందరు నగరాల్లోకి చొరబాటు

  • మావోయిస్టులపై నెలన్నర నిఘా : లడ్డా

రంపచోడవరం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ కగార్‌తో ఛత్తీస్‌గఢ్‌లో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల కారణంగా అక్కడి మావోయిస్టులు ఏపీ వైపు చూస్తున్నారని రాష్ట్ర పోలీసు నిఘా విభాగం అధిపతి, అదనపు డీజీపీ మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు. గత నెలన్నర రోజులుగా సాగిస్తున్న గాలింపుల్లో భాగంగా వారి కదలికలను పక్కాగా పసిగట్టామన్నారు. అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందిన నేపఽథ్యంలో మంగళవారం మధ్యా హ్నం ఆయన రంపచోడవరంలో మీడియాతో మాట్లాడారు. ఛత్తీ్‌సగఢ్‌లో మనుగడ సాగించలేని పరిస్థితుల్లో అక్కడి మావోయిస్టులంతా ఆంధ్రాకు చేరుకున్నారని చెప్పారు. ఎన్‌కౌంటర్లో మృతి చెందిన హిడ్మా, ఆయన భార్య రాజే సహా మరో నలుగురు అడవుల్లోకి చేరారని తెలిపారు. ఈ సాయుధ దళాల కదలికలపై స్పష్టమైన సమాచారంతో తమ బలగాలు చుట్టుముట్టాయని, వారితో జరిగిన ఎదురుకాల్పుల్లో ఈ ఆరుగురు మృతి చెందగా, మరికొందరు పరారయ్యారని ఆయన వివరించారు. సాయుధ పోరాటం వైపు మళ్లిన గిరిజన యువతలో మంగళవారం ఛత్తీ్‌సగఢ్‌ నుంచి వచ్చినవారిలో 50 మందిని కృష్ణా, విజయవాడ, కాకినాడ తదితర జిల్లాల్లో అరెస్టు చేశామని, మరో 20మంది కోసం రాష్ట్రం నలుమూలలా బలగాలు గాలిస్తున్నాయని చెప్పారు.

Updated Date - Nov 19 , 2025 | 05:49 AM