Share News

Bail Plea Rejected: తిరుపతిలో ఫిజియోథెరపీ కోసం చెవిరెడ్డి పిటిషన్‌

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:39 AM

తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను...

Bail Plea Rejected: తిరుపతిలో ఫిజియోథెరపీ కోసం చెవిరెడ్డి పిటిషన్‌

విజయవాడ, జూలై 21(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. దీనిపై సిట్‌ కౌంటర్‌ దాఖలు చేసి వాదనలు వినిపించాల్సి ఉంది. కౌంటర్‌ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరడంతో న్యాయాధికారి పి.భాస్కరరావు విచారణను వాయిదా వేశారు. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సిట్‌ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

గోవిందప్ప రెండోసారి బెయిల్‌ పిటిషన్‌

మద్యం కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న బాలాజీ గోవిందప్ప రెండోసారి బెయిల్‌ పిటిషన్‌ను సోమవారం దాఖలు చేశారు. ఇంతకుముందు ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

Updated Date - Jul 22 , 2025 | 04:41 AM