Former MLA Chevireddy Bhaskar Reddy: ఇంటి భోజనాన్ని అనుమతించండి
ABN , Publish Date - Aug 01 , 2025 | 06:00 AM
విజయవాడ జిల్లా జైల్లో ఉన్న తనకు ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని కోరుతూ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏసీబీ కోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టులో మరోసారి చెవిరెడ్డి పిటిషన్
మూడోసారి సజ్జల శ్రీధర్‌రెడ్డి బెయిల్ పిటిషన్
విజయవాడ, జూలై 31(ఆంధ్రజ్యోతి): విజయవాడ జిల్లా జైల్లో ఉన్న తనకు ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని కోరుతూ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏసీబీ కోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఆ భోజనాన్ని తన సతీమణి లక్ష్మీకాంతమ్మ తీసుకువస్తారని కోర్టుకు తెలిపారు. ఇంతకుముందు ఇంటి భోజనం కోసం చెవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఇప్పుడు గురువారం రెండోసారి పిటిషన్‌ను దాఖలు చేశారు. మద్యం కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డి మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే రెండుసార్లు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేసింది. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ప్రాసిక్యూషన్‌కు నోటీసులివ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగో తేదీకి వాయిదా వేసింది. అదేవిధంగా ఈ కేసులో ఏ2, ఏ3 నిందితులుగా ఉన్న డి.వాసుదేవరెడ్డి, డి.సత్యప్రసాద్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.