ACB Court: చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:30 AM
మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది.
విజయవాడ, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కొద్ది రోజుల కిందట చెవిరెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదప్రతివాదనలు ముగియడంతో న్యాయాధికారి పి.భాస్కరరావు బుధవారం తీర్పును వెలువరించారు.