Share News

Principal Secretary of Rajasthan: ఏపీలో సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు భేష్‌

ABN , Publish Date - Oct 07 , 2025 | 04:29 AM

ఏపీలో పేదరిక నిర్మూలనకు అమలు చేస్తున్న పీ-4 కార్యక్రమం అద్భుతంగా ఉందని రాజస్థాన్‌ ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి చేతన్‌ ప్రకాశ్‌ ప్రశంసించారు.

 Principal Secretary of Rajasthan: ఏపీలో సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు భేష్‌

  • పేదరిక నిర్మూలనకు ‘పీ4’ అద్భుతంగా ఉంది

  • రాజస్థాన్‌ ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి ప్రశంస

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ఏపీలో పేదరిక నిర్మూలనకు అమలు చేస్తున్న పీ-4 కార్యక్రమం అద్భుతంగా ఉందని రాజస్థాన్‌ ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి చేతన్‌ ప్రకాశ్‌ ప్రశంసించారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయని కొనియాడారు. ఇక్కడ అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇందుకు ఏపీ ప్రభుత్వ సహకారం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాజస్థాన్‌ ప్రణాళికశాఖ ఉన్నతాధికారుల బృందం సోమవారం అమరావతి సచివాలయంలో 20 సూత్రాల అమలు చైర్మన్‌ లంకా దినకర్‌తో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా దినకర్‌ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు తీసుకుంటున్న చర్యలను రాజస్థాన్‌ అధికారులకు వివరించామని తెలిపారు. అనంతరం రాజస్థాన్‌ ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి చేతన్‌ ప్రకాశ్‌ మాట్లాడుతూ ఏపీలో అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకున్నామన్నారు. పారదర్శకత కోసం వినియోగిస్తున్న టెక్నాలజీ గురించి తెలుసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్‌ ప్రణాళికశాఖ అధికారులు నిర్మల్‌ సేధి, వినేశ్‌ సింగ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 04:32 AM