Share News

Miss Andhra Crown: ‘మిస్‌ ఆంధ్ర’గా సాత్విక

ABN , Publish Date - Dec 23 , 2025 | 04:36 AM

తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన చెన్నమనేని గమన సాత్విక మిస్‌ ఆంధ్రగా ఎంపికయ్యారు.

Miss Andhra Crown: ‘మిస్‌ ఆంధ్ర’గా సాత్విక

అమరావతి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన చెన్నమనేని గమన సాత్విక మిస్‌ ఆంధ్రగా ఎంపికయ్యారు. ఆదివారం రాత్రి జైపూర్‌లో ఫరెవర్‌ స్టార్‌ ఇండియా సంస్థ నిర్వహించిన అందాల పోటీల్లో సాత్విక దేశ (మిస్‌ ఇండియా) స్థాయిలో నాలుగో స్థానంలో నిలవగా, ఏపీలో మొదటి స్థానంలో నిలిచారు. 22 ఏళ్ల సాత్విక గతంలో ఇదే సంస్థ నిర్వహించిన పోటీల్లో మిస్‌ తిరుపతిగా ఎంపికయ్యారు. సాత్విక తల్లి నెల్లూరు జిల్లా కోర్టులో పనిచేస్తుండగా, తండ్రి సీసీ నాయుడు వెంకటగిరి టీడీపీకి చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్‌.

Updated Date - Dec 23 , 2025 | 04:38 AM