Share News

Environmental Protection: పచ్చదనంతో వాతావరణ మార్పులకు చెక్‌..

ABN , Publish Date - Sep 30 , 2025 | 06:31 AM

వాతావరణంలో సంభవిస్తున్న అనూహ్య మార్పులను సరిచేయాలంటే పచ్చదనం పెంపొందించాల్సిన అవసరం ఉందని ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌...

Environmental Protection: పచ్చదనంతో వాతావరణ మార్పులకు చెక్‌..

  • గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సుగుణమ్మ

విజయవాడ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): వాతావరణంలో సంభవిస్తున్న అనూహ్య మార్పులను సరిచేయాలంటే పచ్చదనం పెంపొందించాల్సిన అవసరం ఉందని ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఎం. సుగుణమ్మ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ నూతన డైరెక్టర్ల ప్రమాణస్వీకారం సోమవారం నిర్వహించారు. సుగుణమ్మ మాట్లాడుతూ.. వాతావరణంలో సంభవిస్తున్న అనూహ్య మార్పుల కారణంగా క్లౌడ్‌ బరస్ట్‌ వంటి విపత్తులు సంభవిస్తున్నాయని, ఈ మార్పులకు చెక్‌ పెట్టాలంటే రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 06:33 AM