Creative Art: 20 టన్నుల ఐరన్ స్ర్కాప్‌తో శివాజీ విగ్రహం
ABN , Publish Date - Dec 29 , 2025 | 03:49 AM
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శిల్పులు 20 టన్నుల ఐరన్ స్ర్కాప్‌తో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
‘కాటూరి గ్యాలరీ’లో శిల్పుల ప్రతిభ
తెనాలి అర్బన్, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శిల్పులు 20 టన్నుల ఐరన్ స్ర్కాప్‌తో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఈ విగ్రహాన్ని ఆదివారం కాటూరి కొండమ్మ ఆవిష్కరించారు. 21.5 అడుగుల ఎత్తు, 18 అడుగులు వెడల్పు ఉన్న ఆరు పలకల మండపంలో రాజసింహాసనంపై ఆశీనుడైన శివాజీ విగ్రహం.. గత వైభవాన్ని గుర్తుకు తెస్తుందని కొండమ్మ అన్నారు. 20 మంది నైపుణ్యం కలిగిన శిల్పులు ఆరు నెలల పాటు శ్రమించి ఈ కళాఖండాన్ని రూపొందించారని శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆటోమొబైల్ విడి భాగాలు, నట్లు, చైన్‌లు, బేరింగ్‌లు, చైన్‌లు వేల సంఖ్యలో సేకరించి విగ్రహ రూపకల్పనకు వినియోగించామని శిల్పులు రవిచంద్ర, శ్రీహర్ష చెప్పారు. విగ్రహావిష్కరణను పురస్కరించుకుని సంస్థలో పని చేస్తున్న 70 మంది కళాకారులను ఘనంగా సత్కరించారు.