లబ్ధి కోసమే కార్యాలయం మార్పు
ABN , Publish Date - May 30 , 2025 | 11:59 PM
రియల్ ఎస్టేట్ లబ్ధి, ఒకరిద్దరి స్వార్థం కోసం పట్టణానికి రెండు కిలోమీటర్లు దూరంగా ప్రజలకు అసౌకర్యంగా ఉండే చోటకు ప్రభుత్వ కార్యాలయాన్ని మార్చేందుకు సిద్ధపడుతున్న టీడీపీ పనులు దుర్మార్గమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.
ఫ మాజీ మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజం
డోన టౌన, మే 30 (ఆంధ్రజ్యోతి): రియల్ ఎస్టేట్ లబ్ధి, ఒకరిద్దరి స్వార్థం కోసం పట్టణానికి రెండు కిలోమీటర్లు దూరంగా ప్రజలకు అసౌకర్యంగా ఉండే చోటకు ప్రభుత్వ కార్యాలయాన్ని మార్చేందుకు సిద్ధపడుతున్న టీడీపీ పనులు దుర్మార్గమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి బుగ్గన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు ఉయోగపడే విధంగా కార్యాలయాలు ఉంటాయనీ, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒకరిద్దరి భూముల లబ్ధి కోసం ఊరికి దూరంగా సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం నిర్మించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పట్టణంలోని సబ్ రిజిస్ర్టార్ ఆఫీసును కూడా రూ.90 లక్షలతో నిర్మించడం జరిగిందన్నారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో డోనను మోడల్ గా అభివృద్ధి చేసేందుకు ఎంతో శ్రమించానన్నారు. గతంలో డోనలో పార్కులు లేక ప్రజలు ఇబ్బందులు పడేవారనీ, వారిని దృష్టిలో ఉంచుకుని పార్కులు, స్విమ్మింగ్‌ఫూల్స్, ఇండోర్ స్టేడియం, విద్యాలయాలతో పాటు వందపడకల ఆసుపత్రి, మార్కెట్ యార్డు వంటి అభివృధ్ది పనులు చేశామని గుర్తు చేశారు. రూ.కోట్లతో నిర్మించిన స్విమ్మింగ్ ఫూల్స్‌ను ఉపయోగించకుండా కోర్టు సాకుతో మున్సిపల్ అఽధికారులు నిరూపయో గంగా ఉంచడం దారుణమన్నారు. శిలాఫలకాలపై పేర్లను తొలగించ వచ్చు గానీ, ప్రజల గుండెల్లో బుగ్గన అభిమానాన్ని పూడ్చలేరని స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, జడ్పీటీసీ బద్దల రాజ్‌కుమార్ యాదవ్, నాయకులు శ్రీరాములు, మల్లెంపల్లె రామచంద్రుడు, సోమేష్ యాదవ్, పోస్టు ప్రసాద్, ఎర్రిస్వామి, ఆర్‌ఈ రాజావర్ధన, టీఈ దినేష్‌గౌడు, జాకీర్ హుశేన, హరి, బుగ్గన జయచంద్ర రెడ్డి, దొరపల్లె చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.