మ్యుటేషనతో ఆస్తుల మార్పు
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:37 PM
ఆస్తులు కొనుగోలు చేసి తరువాత వారి పేర్లపై హక్కులను మార్చునే విధానమే మ్యుటేషన.
కూటమి ప్రభుత్వ నిర్ణయం
ఆగస్టు 1వ తేదీ నుంచి అమలు
నగరపాలక, సచివాలయ సిబ్బందికి శిక్షణ
అవినీతి, అక్రమాలకు ఆస్కారం ఉండదు
ఆస్తులు కొనుగోలు చేసి తరువాత వారి పేర్లపై హక్కులను మార్చునే విధానమే మ్యుటేషన. ప్రజలు తమకు సంబంధించిన ఆస్తులను మార్పు చేసుకునేందుకు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిని అధిగమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. భూమలును సబ్‌రిజిసా్ట్రర్ కార్యాలయం ద్వారా రిజిసే్ట్రషన చేయించుకున్న వెంటనే ఆనలైన విధానంలో ఆటో మ్యుటేషన( ఆనలైనలోనే యజమాని పేరు మారడం) జరుగుతుంది. డిజిటల్ డేటా ఆధారంగా పారదర్శకతతో కూడిన సేవలు అందుబాటులోకి వస్తాయి. అవినీతి, అక్రమాలకు ఎలాంటి అవకాశాలు ఉండవు. రిజిసే్ట్రషన తరువాత ఆస్తి వివరాలు, పన్నుల నమోదు, ఆస్తిపన్ను రికార్డుల్లో చేరుతాయి.
కర్నూలు న్యూసిటీ, జూలై 30(ఆంధ్రజ్యోతి): ప్రజలు తమకు సంబంధించిన ఆస్తులను మార్పు చేసుకునేందుకు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ అవస్థలను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ వాఖ పరిధిలోని భూమలును సబ్‌రిజిసా్ట్రర్ కార్యాలయం ద్వారా రిజిసే్ట్రషన చేయించుకున్న వెంటనే ఆనలైన విధానంలో ఆటో మ్యుటేషన( ఆనలైనలోనే యజమాని పేరు మారడం) జరుగుతుంది. ఈవిధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఇటీవల క్యాబినెట్‌లో దీనిని అమలు చేసేందుకు ఆమోదించారు. ఈ సేవలను నగర పాలక సంస్థ పరిధిలో ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త విధానంపై ఇప్పటికే నగర పాలక, సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు.
గతంలో అధికారులు ఎంతో కొంత
ఆస్తులు కొనుగోలు చేసి తరువాత వారి పేర్లపై హక్కులను మార్చునే విధానమే మ్యుటేషన. పట్టణాల్లో ఆస్తులు కొనుగోలు చేసిన తరువాత ఇంటి, కుళాయి పన్ను రసీదుల్లో పేరు మార్పుకోసం మార్కెట్‌లో ఆ ఆస్థి విలువలో ఒక శాతం మ్యుటేషన ఫీజుగా చలానా చెల్లించి సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటారు. ఆ దరఖాస్తు ఆర్‌ఐ, మేనేజర్, కమిషనర్‌కు చేరుతుంది. దరఖాస్తు ముందుకు వెళ్లాలంటే అధికారులకు ఎంతో కొంత ముడుపులు ఇవ్వాల్సిన పరిస్థితి. అన్ని కరెక్టుగా ఉంటే చివరకు కమిషనర్ లాగినలో పేరు మార్పు జరుగుతుంది. నిబంధనల ప్రకారం 14రోజుల్లో ఈ మొత్తం ప్రక్రియం పూర్తి కావాలి. హక్కుల బదాయింపు కోసం యజమానులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
నూతన విదానంతో...
రిజిసే్ట్రషన సమయంలో గతంలో ఆ ఇంటికి చెల్లిస్తున్న పన్ను రసీదు సమర్పించాలి. స్థలమైతే వీఎల్‌టీ(వెకెంట్ ల్యాండ్ టాక్స్) రసీదు అందజేయాలి. తరువాత ఆటోమెటిక్‌గా నగరపాలక రికార్డుల్లో పేరు మారుతుంది. అవి లేనిపక్షంలో పన్ను వేయాల్సిన అవస రాన్ని వివరిస్తూ రిజిసా్ట్రర్ కార్యాలయం నుంచి నగర పాలక లాగినకు సమాచారం వస్తుం ది. ఆ మేరకు పేరు మార్చి పన్ను విధిస్తారు. ఒకే ఆస్తిని ఇద్దరు ముగ్గురు కలిసి కొనుగోలు చేసిన ఇదే విధానం వర్తిస్తుంది. డిజిటల్ డేటా ఆధారంగా పారదర్శకతతో కూడిన సేవలు అందుబాటులోకి వస్తాయి. అవినీతి, అక్రమాలకు ఎలాంటి అవకాశాలు ఉండవు. రిజిసే్ట్రషన తరువాత ఆస్తి వివరాలు, పన్నుల నమోదు, ఆస్తిపన్ను రికార్డుల్లో చేరుతాయి.
టైటిల్ మార్చి పన్ను విధింపు
నగరంలో ఏదైనా స్థలం, ఇళ్లు కొనుగోలు చేసుకుంటే ఆ ఆస్తిని తమ పేరిట మార్చుకునేందుకు నగర పాలక కార్యాలయంలో ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. సచివాలయం ద్వారా రిజిస్టర్ పత్రాలు ఆనలైనలో పంపితే అఽధికారులు పరిశీలించి టైటిల్ మార్చి పన్ను విధిస్తారు.
ఆటో మ్యుటేషనతోనే పేరు మార్పు
సుపరిపాలనలో భాగంగా రిజిసే్ట్రషన లావాదేవీలు వేగవంతం అవుతాయి. ఇళ్లు, ప్లాట్లు ఏవైనా రిజిసే్ట్రషన జరిగినప్పుడే ఆటో మ్యుటేషనతోనే పేరు మార్పుచేస్తారు. దీనికి సం బంధించి స్టాంప్స్ అండ్ రిజిసే్ట్రషన సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ప్రజలు రిజిసే్ట్రషన సమయంలోనే పేరు మార్పుకోసం అధికారులను సంప్రదించాలి.
ఫ పి.విశ్వనాథ్, నగర పాలక కమిషనర్, కర్నూలు