Chandrababu Bengaluru Visit: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించిన బాబు
ABN , Publish Date - May 22 , 2025 | 06:30 AM
బెంగళూరులోని కొత్త టెర్మినల్-2ను చంద్రబాబు సందర్శించారు. సహజ వాతావరణం మధ్య అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ఈ టెర్మినల్ తనకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రాపంచిక స్థాయి విమానాశ్రయాల అభివృద్ధికి ప్రేరణగా నిలుస్తుందన్నారు.
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా అభివృద్ధి చేసిన టెర్మినల్-2ను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సందర్శించారు. విమానాశ్రయ సీఈవో హరి మారర్‌తో కలిసి టెర్మినల్-2లో సౌకర్యాలపై దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులతో, అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ విశేషాలను ఆయన ‘ఎక్స్’లో పంచుకున్నారు. ‘టెర్మినల్ -2ను సహజ వాతావరణం మధ్య అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది. విమానాశ్రయంలో సహజ ఉద్యానవనాన్ని భాగంగా చేయడం ఆకట్టుకుంటోంది. విమానాశ్రయాన్ని మల్టీ మోడల్ ట్రాన్సిట్ హబ్‌గా తీర్చిదిద్దడం అద్భుతం’ అని చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలన్న తన ఆలోచనకు ఈ సందర్శన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి