CM Chandrababu to Attend Womens Empowerment: నేడు విశాఖకు చంద్రబాబు
ABN , Publish Date - Sep 17 , 2025 | 04:09 AM
విశాఖపట్నంలో నిర్వహిస్తున్న స్వస్థ్ నారీ - సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విశాఖకు వెళ్లనున్నారు....
‘నారీ-సశక్త’ అభియాన్‌కు హాజరు
అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ‘స్వస్థ్ నారీ - సశక్తి పరివార్ అభియాన్‘ కార్యక్రమలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విశాఖకు వెళ్లనున్నారు. ఉదయం 11.35 గంటలకు ఆయన నగరానికి చేరుకుంటారు. ఆంరఽధ వర్సిటీ సాగరిక ఫంక్షన్ హాల్ హెల్త్ క్యాంపులను సీఎం సందర్శిస్తారు. ఆ తర్వాత 12 గంటలకు ఆంరఽధ విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించే మహిళా ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రాడిసన్ బ్లూ హోటల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బిజినెస్ సమ్మిట్లో సీఎం పాల్గొంటారు.