Share News

Minister of State for Railways Somanna: రైల్వే పనులకు చంద్రబాబు సహకారం

ABN , Publish Date - Oct 18 , 2025 | 05:44 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఏపీలో రైల్వే లైన్ల పనులు శర వేగంగా చేపడుతున్నామని రైల్వే సహాయ మంత్రి సోమన్న పేర్కొన్నారు.

Minister of State for Railways Somanna: రైల్వే పనులకు చంద్రబాబు సహకారం

  • రైల్వే సహాయ మంత్రి సోమన్న

మడకశిర, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఏపీలో రైల్వే లైన్ల పనులు శర వేగంగా చేపడుతున్నామని రైల్వే సహాయ మంత్రి సోమన్న పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో రైల్వే లైన్లు నిర్మించగలుగుతున్నామన్నారు. కర్ణాటకలోని తుమకూరు, అనంతపురం జిల్లాలోని రాయదుర్గం మధ్య రైల్వేలైన్‌ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, 2027 మార్చిలోపు పూర్తి చేస్తామని చెప్పారు. మడకశిర నియోజకవర్గ పరిధిలో రాయదుర్గం-తుమకూరు రైల్వేలైన్‌ పనులను మంత్రి శుక్రవారం పరిశీలించారు. మడకశిరఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

Updated Date - Oct 18 , 2025 | 05:45 AM