Share News

Popular CM: అత్యంత జనాదరణ కలిగిన సీఎంలలో మూడో స్థానం చంద్రబాబు

ABN , Publish Date - Aug 30 , 2025 | 03:30 AM

దేశంలో అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు మూడో స్థానంలో నిలిచారు. దేశంలోని 28 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంల పనితీరుపై....

Popular CM: అత్యంత జనాదరణ కలిగిన సీఎంలలో మూడో స్థానం చంద్రబాబు

  • ‘ఇండియా టుడే’ సర్వేలో వెల్లడి

  • తొలి రెండు స్థానాల్లో యోగి, మమత

  • గత సర్వేలో 5వ స్థానంలో బాబు

అమరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): దేశంలో అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు మూడో స్థానంలో నిలిచారు. దేశంలోని 28 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంల పనితీరుపై ‘ఇండియా టుడే’ సంస్థ నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌’ సర్వేలో ఈ ఫలితం వెలుగుచూసింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ 36 శాతం జనామోదంతో మొదటి స్థానంలో నిలువగా.. 12.5 శాతంతో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ రెండో స్థానంలో, 7.3 శాతం జనామోదంతో చంద్రబాబు తృతీయ స్థానంలో ఉన్నారు. బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ 4.3 శాతంతో నాలుగో స్థానంలో.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ 3.8 శాతంతో ఐదో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఇదే సర్వేలో చంద్రబాబు ఐదో స్థానంలో ఉన్నారు. ఇండియా టుడే 2001 నుంచి మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరుతో ఏడాదికి రెండు సార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై దేశ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ వస్తోంది.

Updated Date - Aug 30 , 2025 | 03:32 AM