Share News

ప్రజల్లో చంద్రబాబు... ప్యాలెస్‌లో జగన్‌: అనగాని

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:25 AM

సీఎం హోదాలో చంద్రబాబు 13 నెలల్లో 56 సార్లు ప్రజాహితం కోసం క్షేత్రస్థాయిలో పర్యటించారు. గతంలో జగన్‌ ప్యాలెస్‌కే పరిమితమయ్యారు.

ప్రజల్లో చంద్రబాబు... ప్యాలెస్‌లో జగన్‌: అనగాని

తిరుపతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): ‘సీఎం హోదాలో చంద్రబాబు 13 నెలల్లో 56 సార్లు ప్రజాహితం కోసం క్షేత్రస్థాయిలో పర్యటించారు. గతంలో జగన్‌ ప్యాలెస్‌కే పరిమితమయ్యారు. ప్రజల్లోకి రావాల్సిన సందర్భం తప్పనిసరైతే పరదాలు కట్టుకునే పరిస్థితి’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. తిరుపతిలో మంగళవారం జరిగిన స్వచ్ఛత విజయోత్సవ సభలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోంది. వైసీపీ నేతల్లా రాష్ట్రాన్ని దోచుకోలేదు. 2019లో టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే నలుగురు పార్టీ మారారు. మిగిలిన వాళ్లం అసెంబ్లీకి వచ్చేవాళ్లం. ఇప్పుడు 11 మంది ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేకపోతున్నారు. పులివెందుల ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి ఉంటే, ప్రజాహితం కోసం మాట్లాడాలి అనుకుంటే అసెంబ్లీకి రావాలి’ అన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 05:26 AM