Share News

Investment Summit: నేడు ఢిల్లీకి చంద్రబాబు

ABN , Publish Date - Sep 30 , 2025 | 04:20 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. మంగళవారం ఉద యం 10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి..

Investment Summit: నేడు ఢిల్లీకి చంద్రబాబు

  • పెట్టుబడుల సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరనున్న సీఎం

  • అమిత్‌షా, నిర్మలతోనూ భేటీ

అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. మంగళవారం ఉద యం 10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి.. అక్కడ భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సదస్సులో పాల్గొంటారు. విశాఖలో నవంబరు 14, 15 తేదీల్లో సీఐఐతో కలిసి నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తారు. ఈ సదస్సుకు దేశవిదేశాల్లోని పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం రోడ్‌షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిం దే. ఈ క్రమంలో ఢిల్లీలో మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు జరిగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమిట్‌ కర్టెన్‌రైజర్‌ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. తన పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ ఆయన సమావేశమవుతారు. రాత్రికి అక్కడే బస చేసి బుధవారం(అక్టోబరు 1న) నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. అదే రోజు విజయనగరం జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీలో భాగం గా ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొంటారు.

Updated Date - Sep 30 , 2025 | 04:21 AM