Share News

AP CM Chandrababu: మీకు మేమున్నాం..

ABN , Publish Date - Jul 05 , 2025 | 04:00 AM

ప్రత్యర్థుల చేతుల్లో హతులైన టీడీపీ నేతల కుటుంబాలకు సీఎం చంద్రబాబు మేమున్నా మంటూ భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ...

AP CM Chandrababu: మీకు మేమున్నాం..

  • జెవిశెట్టి సోదరుల కుటుంబాలకు చంద్రబాబు భరోసా

  • చెరో 25 లక్షలు ఆర్థిక సాయం... పిల్లలకు ఉద్యోగాలు

మాచర్ల టౌన్‌, జూలై 4(ఆంధ్రజ్యోతి): ప్రత్యర్థుల చేతుల్లో హతులైన టీడీపీ నేతల కుటుంబాలకు సీఎం చంద్రబాబు మేమున్నా మంటూ భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకుల జెవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అన్నదమ్ములు. వారిరువురూ ప్రత్యర్థుల చేతిలో హతులైన సంగతి విదితమే. శుక్రవారం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో కలసి జెవిశెట్టి సోదరుల కుటుంబ సభ్యులు సీఎంను కలిశారు. జెవిశెట్టి సోదరులు పార్టీకి అందించిన సేవలను, కుటుంబ ఆర్థిక స్థితిని వివరించారు. స్పందించిన చంద్రబాబు, కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబాలకు చెరో రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 04:02 AM